Health

Walking Benefits: రోజుకు పది వేల అడుగులు.. ఆరోగ్యమా? లేక అపోహా?

Walking Benefits: చేతికి స్మార్ట్‌వాచ్ కట్టుకోవడం, రాత్రి పడుకునే ముందు స్క్రీన్ మీద '10,000 స్టెప్స్' అని కనిపించగానే మురిసిపోవడం ఇప్పుడు చాలామంది దినచర్యలో భాగమైపోయింది. సోషల్ మీడియాలో ఆ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ.. ఇక తమకు తిరుగులేదని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేశామని భావిస్తుంటారు. అయితే నిజంగానే రోజుకు పది వేల అడుగులు వేస్తే పూర్తి ఫిట్‌నెస్ సొంతమవుతుందా? లేకఇదొక అపోహ మాత్రమేనా? నిజానికి నడక అనేది అత్యంత సురక్షితమైన, అద్భుతమైన అలవాటు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి మధ్యమధ్యలో లేచి నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గడానికీ, మానసిక ప్రశాంతతకూ నడక ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, కేవలం పది వేల అడుగులు వేసినంత మాత్రాన శరీరానికి కావాల్సిన పూర్తి వ్యాయామం అందిందని అనుకోవడం మాత్రం పొరపాటే.