తెలంగాణ

TelanganaLandResurvey: భూముల రీసర్వేలో ఎక్కువ విస్తీర్ణం తేలితే..? రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు!

 తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యవసాయ, సర్కారు భూముల సమగ్ర రీ సర్వే(LandResurvey)పై రాష్ట్ర రెవెన్యూ శాఖ అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రీ సర్వే కొలతల్లో ఏ రైతుకైనా పాసుపుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ విస్తీర్ణం తేలితే, ఆ అదనపు భూమిని తమదేనంటూ ఎవరూ యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేయడానికి వీలేదని నిబంధనల్లో తేల్చిచెప్పింది. సర్వే ముగిసిన అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. రికార్డుల కంటే అదనంగా ఉన్న విస్తీర్ణాన్ని సదరు రైతుల నుంచి వెనక్కి తీసుకుని, నిబంధనల ప్రకారం అర్హులై భూమి తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న ఇతర రైతులకు చట్టబద్ధంగా సర్దుబాటు చేయాలని రెవెన్యూ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.