స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

క్యా సీన్ హై.. గంజాయి బ్యాచ్‌తో పోలీసుల దావత్?క్రైమ్Swechaa14 Aug 2026, 02:35 PM

క్యా సీన్ హై.. గంజాయి బ్యాచ్‌తో పోలీసుల దావత్?

నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది.అయితే, నిన్న పెద్దఎత్తున గంజాయి పట్టుబడగా, నిందితులతో పోలీసులు దోస్తానా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఈగల్ టీమ్స్.. గంజాయి బ్యాచ్ ఇంటిపై దాడులు చేయగా పోలీసులపై నిందితులు కుక్కలను వదిలారు, అంతటితో ఆగకుండా స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశారు.. నిందితులను పట్టుకొని విచారించగా వీరితో బాలానగర్ పీఎస్‌కు చెందిన పోలీసులు కూడా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లు ఈగల్ టీమ్స్ గుర్తించాయి. ఈగల్ టీం దాడి చేసే కంటే కొన్ని గంటల ముందే నిందితుల ఇంటికి పోలీసులు వచ్చి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది.

CJI : మధ్యలో  మీ జోక్యం ఏంటి?.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్!NationalSwechaa14 Aug 2026, 01:20 PM

CJI : మధ్యలో మీ జోక్యం ఏంటి?.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్!

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు తీసుకోబోమని ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘నాకు విద్యార్థులకు మధ్య జరిగే సంభాషణలో మీ జోక్యం ఏంటి?’ అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)పై CJI సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఇచ్చిన ఆదేశాలపై మండిపడినట్టు తెలుస్తోంది.

ఆస్తి పిచ్చికి పరాకాష్ట.. మరణించిన తండ్రి వేలిముద్రలతో దారుణం!క్రైమ్Swechaa14 Aug 2026, 01:10 PM

ఆస్తి పిచ్చికి పరాకాష్ట.. మరణించిన తండ్రి వేలిముద్రలతో దారుణం!

ఆస్తి పిచ్చి మనుషుల మధ్య రక్తసంబంధాలను ఎంతగా దిగజారుస్తుందో నిరూపించే అత్యంత దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. బతికి ఉన్నంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రిని కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేసిన ఒక కొడుకు, ఆయన మరణించిన తర్వాత కూడా ఆస్తి కోసం దయ్యంలా మారాడు. ఆఖరికి తండ్రి మృతదేహాన్ని కూడా వదలకుండా ఖాళీ కాగితాలపై ఆయన వేలిముద్రలను తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

టాటా సన్స్ ఛైర్మన్ ఎంపికకు ఊహించని బ్రేక్.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్ట్స్?వ్యాపారంSwechaa14 Aug 2026, 12:54 PM

టాటా సన్స్ ఛైర్మన్ ఎంపికకు ఊహించని బ్రేక్.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్ట్స్?

భారతీయ దిగ్గజ పారిశ్రామిక సామ్రాజ్యం టాటా గ్రూప్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మరోమారు ఆ పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపకపోవడంతో, ఆయన వారసుడిని వెతికేందుకు నూతన ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ ఎంపిక బాధ్యతలను భుజాన వేసుకోవాల్సిన టాటా గ్రూప్ మాతృసంస్థ ‘టాటా ట్రస్ట్స్’కు చట్టపరమైన సమస్య ఒకటి ఎదురైంది. గ్రూప్‌లోని కీలక విభాగమైన ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ (SRTT) ప్రతినిధులు నూతన అధ్యక్షుడి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనకుండా మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షలు పెద్ద అడ్డంకిగా మారాయి.

Sharwanand: ప్రయోగాలు పక్కనపెట్టి శ్రీను వైట్ల కామెడీకి రెడీ..సినిమాSwechaa14 Aug 2026, 12:36 PM

Sharwanand: ప్రయోగాలు పక్కనపెట్టి శ్రీను వైట్ల కామెడీకి రెడీ..

Sharwanand: టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈరోజే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ అధికారికంగా మొదలైంది. జార్జ్ క్రిష్ అనే టైటిల్‌తో శర్వానంద్ - శ్రీను వైట్ల మూవీ సెట్స్‌పైకి రాబోతోంది. అయితే, ఇంత గ్యాప్ తర్వాత కూడా శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ కాన్సెప్ట్‌తోనే రాబోతుండటం ఆసక్తికరం.

ముస్లింలకు ఫ్రీ కరెంట్.. హిందువులకు హైడ్రానా?  : బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతెలంగాణSwechaa14 Aug 2026, 12:36 PM

ముస్లింలకు ఫ్రీ కరెంట్.. హిందువులకు హైడ్రానా? : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం (ఎక్స్)వేదికగా కౌంటర్ ఇచ్చారు. నిన్న కూకట్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓల్డ్ సిటీలో మైనారిటీలు కరెంట్ బిల్లులు కట్టరనే ఆరోపణలు ఉన్నాయని, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరాక అమలు చేస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత పథకం వల్ల ఎక్కువగా మైనారిటీలకే లబ్ధి చెందుతోందని సీఎం అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఫైర్ అయ్యారు.'పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని తెలంగాణ సీఎం అన్నారు. ఇదే మీ ప్రభుత్వ విధానమైతే.. నిబంధనలు పాటించలేదనే కారణంతో హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పుడు పేద కుటుంబాల విషయంలో ఇదే సానుభూతిని ఎందుకు చూపడం లేదు?' అని ప్రశ్నించారు.

అమెరికా చదువుకు బ్రేక్‌.. భారతీయ విద్యార్థుల డ్రీమ్‌కు డేంజర్ బెల్స్?InternationalSwechaa14 Aug 2026, 12:18 PM

అమెరికా చదువుకు బ్రేక్‌.. భారతీయ విద్యార్థుల డ్రీమ్‌కు డేంజర్ బెల్స్?

అమెరికా వెళ్లే విద్యార్థులకు చదువు మాత్రమే కాదు.. చదువు తర్వాత ఉద్యోగం, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌, అక్కడి కెరీర్‌ అవకాశాలు కూడా కీలకం. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థుల వర్క్‌ ప్రోగ్రామ్‌లపై కూడా అమెరికా ప్రభుత్వం మరింత కఠినమైన పర్యవేక్షణ పెంచుతోంది.

మాజీ డీజీపీ సవాంగ్‌కు బిగుస్తున్న ఉచ్చు?ఏపీSwechaa14 Aug 2026, 12:12 PM

మాజీ డీజీపీ సవాంగ్‌కు బిగుస్తున్న ఉచ్చు?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలవ్వగా..2019 మే 26న ప్రిలిమ్స్‌, 2020 డిసెంబరులో మెయిన్స్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం మాన్యువల్‌ విధానంలో జవాబుపత్రాల మూల్యాంకనం జరగాలి, కానీ కోవిడ్‌ ఉందన్న కారణంతో డిజిటల్‌ మూల్యాంకనం చేశారు. అక్కడే పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రిసార్టులో జరిగిన మూల్యాంకనంపై కోర్టు సీరియస్ అవ్వడంతో కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ మరల విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయంలో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించారు. అయితే, మాన్యువల్ మూల్యాంకనం, డిజిటల్ ఫలితాలకు ఏకంగా 62% వ్యత్యాసం వచ్చింది. దీంతో వందలాది పేపర్లలో దిద్దుబాట్లు జరిగినట్టు అభ్యర్థులు ఆరోపించారు. దీని వెనుక సవాంగ్ కుట్ర పన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Vijay Sethupathi: పూరి వల్లే ‘స్లమ్ డాగ్’ విడుదల ఆలస్యం..ఈ మాటలో అసలు నిజం లేదట!సినిమాSwechaa14 Aug 2026, 12:11 PM

Vijay Sethupathi: పూరి వల్లే ‘స్లమ్ డాగ్’ విడుదల ఆలస్యం..ఈ మాటలో అసలు నిజం లేదట!

Vijay Sethupathi: Vijay Sethupathi: ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తమిళ విలక్షణ నటిడు విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. అయితే, ఇన్నాళ్ళు ఈ సినిమా రిలీజ్ కి పూరి జగన్నాధ్ కి మార్కెట్ లేకపోవడం వల్లే అనుకున్నారు. కానీ, విజయ్ సేతుపతి నటించిన రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ‘స్లమ్ డాగ్’ విడుదల ఆపుతున్నట్టుగా సమాచారం.

ప్రొటెస్ట్ చేస్తే కెమెరాలో చిక్కిపోతారా? అసలు గేమ్ ఇదేNationalSwechaa14 Aug 2026, 11:55 AM

ప్రొటెస్ట్ చేస్తే కెమెరాలో చిక్కిపోతారా? అసలు గేమ్ ఇదే

ఒక పౌరుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఒక విధానాన్ని వ్యతిరేకించడానికి లేదా తన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేయడానికి రోడ్డుపైకి వస్తే... అతను నేరస్థుడు కాదు. మరి అలాంటి వ్యక్తిపై బయోమెట్రిక్ నిఘా పెట్టడానికి ఏ పరిమితులు ఉండాలి?

సీఎం సోదరుడిపై కామెంట్స్.. ఎంపీ చామలపై అధిష్టానం ఆగ్రహం!రాజకీయాలుSwechaa14 Aug 2026, 11:39 AM

సీఎం సోదరుడిపై కామెంట్స్.. ఎంపీ చామలపై అధిష్టానం ఆగ్రహం!

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి కేటాయించిన రూ.వందల కోట్ల విలువైన భూమి విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.రూ.లక్ష పెట్టుబడితో స్థాపించిన టెస్సరాక్ట్ కంపెనీకి సీఈవో తాను అని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి పోస్టు పెట్టడం, ఒక్క ఉద్యోగి కూడా లేని ఆ కంపెనీకి రూ. 135 కోట్ల విలువ చేసే 5 ఎకరాలు కేటాయించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మన్నె క్రిశాంక్ తీవ్ర ఆరోపణలు , విమర్శలు గుప్పించారు.దీనిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. రూ.135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతుగా మాట్లాడటం పొలిటికల్ చర్చకు దారితీసింది. ‘

ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ.. కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్స్!ఏపీSwechaa14 Aug 2026, 11:39 AM

ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ.. కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్స్!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఆధ్యాత్మిక ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసపు తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు ఆధ్యాత్మిక శోభతో కిక్కిరిసిపోయాయి. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయంలో నెలాఖరు వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.

Mohan babu: ‘ది ప్యారడైజ్’తోనైనా మోహన్ బాబు ఫామ్ లోకి వస్తాడా?సినిమాSwechaa14 Aug 2026, 11:05 AM

Mohan babu: ‘ది ప్యారడైజ్’తోనైనా మోహన్ బాబు ఫామ్ లోకి వస్తాడా?

Mohan babu: మోహన్ బాబు ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఒకరకంగా హీరోను ఢీకొనే పాత్ర అని ఇటీవల వచ్చిన టీజర్ చూస్తే అర్థమైంది. గత కొంతకాలంగా సరైన క్యారెక్టర్ పడక పెద్దగా కనిపించని మోహన్ బాబు ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉన్నాడట. నానికి ధీటైన పాత్ర ‘ది ప్యారడైజ్’ మూవీలో పోషించినట్టుగా తెలుస్తోంది.

బీసీసీఐలో కీలక పరిణామాలు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు సరికొత్త బాధ్యతలు?క్రీడలుSwechaa14 Aug 2026, 10:54 AM

బీసీసీఐలో కీలక పరిణామాలు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు సరికొత్త బాధ్యతలు?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహణ వ్యవస్థలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీమిండియా మాజీ దిగ్గజ బ్యాటర్, ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (సీవోఈ) అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌కు బోర్డులో కీలకమైన పదవి లభించనున్నట్లు సమాచారం. ఆయనను 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' అనే నూతన హోదాలో నియమించేందుకు బీసీసీఐ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రాబోయే సెప్టెంబర్ నెలలో నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ నిర్ణయానికి సంబంధించి అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్‌గా భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్, పునరావాసం, శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ దిల్ రాజుకి దక్కేనా?సినిమాSwechaa14 Aug 2026, 10:38 AM

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ దిల్ రాజుకి దక్కేనా?

Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోవడానికి మన రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారట.

Trump Escap: క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ ఎస్కేప్.. ఇరాన్ మీడియా ట్రోలింగ్!InternationalSwechaa14 Aug 2026, 10:34 AM

Trump Escap: క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ ఎస్కేప్.. ఇరాన్ మీడియా ట్రోలింగ్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటన సందర్భంగా జరిగిన ఒక విమాన మార్పిడి వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ చేపట్టిన రహస్య ఆపరేషన్ ఆధారంగా ఇరాన్ ప్రభుత్వం, అక్కడి అధికారిక మీడియా ట్రంప్‌ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తోంది. ఇరాన్ సైనిక బలగాల దాడి భయంతోనే ట్రంప్ భద్రత కోసం తన అధికారిక విమానాన్ని వదిలేసి, రహస్యంగా వేరే జెట్ లోకి మారాల్సి వచ్చిందని ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వైరం ముదిరిన తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

వీడిన నల్గొండ జంట హత్యల కేసు మిస్టరీ.. మర్డర్స్ వెనుక కన్నింగ్ ‘ఖాకీ’..!క్రైమ్Swechaa14 Aug 2026, 10:28 AM

వీడిన నల్గొండ జంట హత్యల కేసు మిస్టరీ.. మర్డర్స్ వెనుక కన్నింగ్ ‘ఖాకీ’..!

ఉమ్మడి నల్గొండ జిల్లా మోతె మండంలో జంటహత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం రోజున ఈ హత్యా ఉదంతం వెలుగుచూడగా.. సూర్యాపేట పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. జంటహత్యల కేసు వెనుక ఉన్నది ఓ కానిస్టేబుల్ అని తేల్చారు. వివాహేతర సంబంధం, డబ్బుల విషయంలో గొడవనే హత్యకు దారితీసిందని సమాచారం. బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు(50), భూబా(40) దంపతులు రెండేండ్ల కిందట పొట్టకూటి కోసం మోతె మండల కేంద్రానికి వలసొచ్చారు. బొక్క అమృత రెడ్డికి చెందిన కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. మంగళవారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగుల దాడిలో దంపతుల మరణించారు.

Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!NationalSwechaa14 Aug 2026, 10:21 AM

Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు భద్రతాపరంగా 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రానికి 'ఆరెంజ్ అలర్ట్'ను జారీ చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపుకు కదులుతోంది.

NALSAR : నల్సార్ విద్యార్థులపై బీసీఐ బ్యాన్.. అంతలోనే విత్ డ్రా.. అసలేమైంది?టాప్ న్యూస్Swechaa14 Aug 2026, 09:57 AM

NALSAR : నల్సార్ విద్యార్థులపై బీసీఐ బ్యాన్.. అంతలోనే విత్ డ్రా.. అసలేమైంది?

హైదారాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ లా కాలేజీపై తీవ్ర వివాదం చెలరేగింది. జెన్ జీని బొద్దింకలతో పోల్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకోబోమని నల్సార్ లా కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొందరు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. NALSAR న్యాయ కళాశాల విద్యార్థుల నమోదున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని, 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.

హైదరాబాద్‌-శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం.. యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు!..క్రైమ్Swechaa14 Aug 2026, 09:46 AM

హైదరాబాద్‌-శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం.. యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు!..

హైదరాబాద్‌–శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి కిందపడిన శివయాదవ్‌ను.. వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శివయాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాండ్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Megastar-Super Star: దసరా, సంక్రాతి బరిలో మెగాస్టార్-సూపర్ స్టార్!సినిమాSwechaa14 Aug 2026, 09:44 AM

Megastar-Super Star: దసరా, సంక్రాతి బరిలో మెగాస్టార్-సూపర్ స్టార్!

Megastar-Super Star: ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా, అక్టోబర్ 15వ తేదీన సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇదే, నిజమైతే బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఉండబోతోంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!ఏపీSwechaa14 Aug 2026, 09:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!

కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎలాంటి ప్రత్యేక టికెట్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి కనీసం 18గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. ఆలయ ప్రాంగణంలో పెరిగిన తాకిడి కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోని 31కంపార్టుమెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు నారాయణగిరి ఉద్యానవనంలోని తొమ్మిది రక్షణ షెడ్లు కూడా సర్వదర్శన యాత్రికులతో పూర్తిగా నిండిపోయాయి.

తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో జోష్.. ఆదాయంలో భారీ పెరుగుదల!..తెలంగాణSwechaa14 Aug 2026, 09:23 AM

తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో జోష్.. ఆదాయంలో భారీ పెరుగుదల!..

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఏకంగా 1,408 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. 2025లో ఇదే సమయంలో 8,706 కోట్ల రూపాయల రాబడి రాగా.. 2026లో అది 10,114 కోట్లకు చేరింది. భూముల మార్కెట్ విలువలు సవరించినా.. రిజిస్ట్రేషన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. జూన్, జూలైలోనూ ఆదాయం పెరుగుతూ వచ్చింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు, కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

9 సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు.. ఆ రహస్య సాంకేతికత ఏంటో తెలుసా?తెలంగాణSwechaa14 Aug 2026, 09:11 AM

9 సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు.. ఆ రహస్య సాంకేతికత ఏంటో తెలుసా?

TG: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీడీఎస్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు స్వస్తి పలికేందుకు, నకిలీ కార్డుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఏకంగా తొమ్మిది రకాల సెక్యూరిటీ ఫీచర్లను ఈ కొత్త కార్డులలో పొందుపరుస్తున్నారు. ఈ నూతన కార్డుల తయారీలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక రూపాకల్పన చేశారు.

బొమ్మరాసిపేట్ భూముల స్కాంలో బాధలు ఎవరికి?..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa14 Aug 2026, 08:46 AM

బొమ్మరాసిపేట్ భూముల స్కాంలో బాధలు ఎవరికి?..

స్వేచ్ఛ సాక్ష్యాధారాల కథనాలతో తమ భూ హక్కుల కోసం బాధితులు కదం తొక్కుతున్నారు.ఈ క్రమంలో శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వారసత్వాన్ని కేవలం ఐదేళ్లలో జరిగిన భూ కుయుక్తులతో దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. వందల ఎకరాలకు కొత్తగా పాస్‌బుక్‌లు జారీ చేస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

పార్లమెంట్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి..!NationalSwechaa13 Aug 2026, 11:55 PM

పార్లమెంట్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి..!

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత మిగిలిన అసలు ప్రశ్న ఎన్ని బిల్లులు పాస్ అయ్యాయి? కాదు. ఎన్ని బిల్లులపై అర్థవంతమైన చర్చ జరిగింది అనేదే. ప్రజాస్వామ్యంలో నెంబ‌ర్లు ముఖ్యమే. కానీ దానికంటే ముందు.. సమాధానాలు చాలా ముఖ్యం. మెజారిటీ ముఖ్యం. కానీ దానికంటే ముందు బాధ్యత ముఖ్యం.

AYUSH: దద్దరిల్లిన ధర్నాచౌక్‌.. AYUSH విద్యార్థుల మహా ధర్నాతెలంగాణSwechaa13 Aug 2026, 11:19 PM

AYUSH: దద్దరిల్లిన ధర్నాచౌక్‌.. AYUSH విద్యార్థుల మహా ధర్నా

AYUSH: తెలంగాణలో AYUSH హౌస్ సర్జన్లు, ఇంటర్న్ లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్ వైద్యుల స్టైపెండ్ పెంపు కోసం తెలంగాణ AYUSH HS & PG Joint Action Committee (AYUSH-JAC) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ AYUSH వైద్య విద్యా సంస్థలకు చెందిన వెయ్యి మందికిపైగా విద్యార్థులు, ఇంటర్న్ లు, హౌస్ సర్జన్లు, PG వైద్యులు ఈ మహా ధర్నాలో పాల్గొని తమ నిరసనను బలంగా వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్లుగా స్టైపెండ్ పెంచకపోవడం, AYUSH వైద్య విద్యార్థుల పట్ల కొనసాగుతున్న అసమానత, వివక్షకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు.

August 15 Celebrations: పంద్రాగస్టు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి-వికాస్ రాజ్తెలంగాణSwechaa13 Aug 2026, 11:00 PM

August 15 Celebrations: పంద్రాగస్టు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి-వికాస్ రాజ్

August 15 Celebrations: పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు రవాణ, ఆర్అండ్‌బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్. స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారాయన. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

బెంగాల్‌లా తెలంగాణలో చేస్తామంటే ఊరుకునేది లేదుతెలంగాణSwechaa13 Aug 2026, 10:43 PM

బెంగాల్‌లా తెలంగాణలో చేస్తామంటే ఊరుకునేది లేదు

Cm Revanth: SIR పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 'బెంగాల్ లో గెలిచామని ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారు. బెంగాల్ లో మమతా బెనర్జీ వదిలేశారేమో.. ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని నేను చెప్పా. గల్లీ గల్లీ తిరగండి, ఇంటింటికీ వెళ్లండి.. ప్రతి ఒక్కరి ఓటును చెక్ చేయండి. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కును కోల్పోకుండా చూడండి. ప్రతీ ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి'' అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో “మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

NBK 112: బాలయ్యతో కొరటాల శివ సినిమా లేనట్టేనా? కారణం!సినిమాSwechaa13 Aug 2026, 10:41 PM

NBK 112: బాలయ్యతో కొరటాల శివ సినిమా లేనట్టేనా? కారణం!

NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య తన 112వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వాస్తవానికి, ఈ నెలలో షూటింగ్ కూడా మొదలవ్వాల్సింది. కానీ, తాజా సమాచారం మేరకు, ఇప్పుడీ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి, కారణం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే రెమ్యునరేషన్ కాకుండానే 150 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. ఈ బడ్జెట్ పెట్టొద్దనే బాలయ్య ఆపేయమన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.