తెలంగాణ

Telangana: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్.. కోర్టు కీలక ఆదేశం!!..

4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన చెల్లింపుల వ్యవహారంలో ప్రభుత్వ నిధులు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 55 కోట్ల రూపాయల నిధుల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా ఇంపౌండ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి ఈ మేరకు కోర్టు అధికారికంగా లేఖ రాసింది.

హైదరాబాద్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన చెల్లింపుల వ్యవహారంలో ప్రభుత్వ నిధులు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 55 కోట్ల రూపాయల నిధుల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లోంగోను నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది.

దర్యాప్తులో భాగంగా నిందితులను ఇప్పటికే విచారించిన అధికారులు వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.

ఈ నేపథ్యంలో నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు వారి పాస్‌పోర్టులను ఇంపౌండ్ చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఆర్‌పీవోను ఆదేశించింది.

అయితే ఐదో నిందితుడైన అల్బెర్టో లోంగో విదేశీయుడు కావడంతో, ఆయన పాస్‌పోర్టుపై భారత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం లేదని కోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు మిగతా ముగ్గురి పాస్‌పోర్టులపై హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం తదుపరి చర్యలు చేపట్టనుంది. దీంతో ఫార్ములా-ఈ కేసులో దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ మరో దశకు చేరుకుంది.

#Telangana#BRS#KTR#Big shock#Formula E case#court issues#key order
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి