Tollywood: కమర్షియల్ సినిమాలకి రానున్న రోజుల్లో కాలం చెల్లబోతుందా? ప్రస్తుతం మన సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న సినిమాలను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రతీ 10 ఏళ్లకి ఇండస్ట్రీలో ఒక జానర్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోను దృష్టిలో పెట్టుకొనే కథలు తయారయ్యేవి. ఆ కథలతోనే బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.
దర్శకుడు తేజ వచ్చి చిత్రం అని సినిమా తీశాక దాదాపు 10 ఏళ్ల పాటు టాలీవుడ్ సినిమా ఇండట్రీలో ప్రేమ కథలే రాజ్యమేలాయి. యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను దర్శకరచయితలు దృష్టిలో పెట్టుకొని ఈ జానర్ సినిమాలను రూపొందించారు. చిత్రం, నువ్వు-నేను, ఆనందం, జయం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి, ప్రియమైన నీకు, ఆర్య..ఇలా ఉదయ్ కిరణ్, తరుణ్, అల్లు అర్జున్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
దాని తర్వాత ఫ్యాక్షన్ సినిమాలొచ్చాయి. సమరసింహారెడ్డి నుంచి పదేళ్ల పాటు ఫ్యాక్షన్ సినిమాలే విధ్వంసాన్ని షృష్టించాయి. ఇక, ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ బెల్ట్‌లో నడుస్తోన్న ట్రెండ్ మైథాలజీ చిత్రాలు. తేజ సజ్జా లాంటి చిన్న హీరో నుంచి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ వరకూ దాదాపు అందరూ ఇదే జానర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన హనుమాన్ అన్శ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది.
ఇప్పుడు, కూడా రామాయాణ, వారణాసి, జై హనుమాన్, విశ్వంభర సహా పలు చిత్రాలు మైథలాజికల్, డివోషనల్ జానర్‌తో రూపొందుతున్నాయి. అయితే, ఎక్కువగా వీఎఫెక్స్..గ్రాఫిక్స్ మీద ఆధారపడి సినిమా తీయాలనుకుంటూ అసలు కథ పట్టు తప్పి భారీ నష్టాలు వస్తున్నాయి. కథ మీద రీసర్చ్ చెసి గనక టార్గెటెడ్ బడ్జెట్‌తో తీస్తే వందల కోట్ల లాభాలను చూడొచ్చు.


