సినిమా

Trivikram: ఆదర్శ కుటుంబం సినిమాకి హైప్ రాకుండా చేస్తున్నారా?

4 నిమిషాల పఠనం

Trivikram: కొన్ని సినిమాలకి అంచనాలు చాలా అవసరం. కొన్ని సినిమాలకి మాత్రం అసలు ఏమాత్రం బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ థ్రిల్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అలాంటి, సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సందర్భాలెన్నో ఉన్నాయి. శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమా సంక్రాంతి బరిలో మెగాస్టార్, బాలయ్యతో పోటీ పడి వచ్చాడు.

Trivikram: కొన్ని సినిమాలకి అంచనాలు చాలా అవసరం. కొన్ని సినిమాలకి మాత్రం అసలు ఏమాత్రం బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ థ్రిల్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అలాంటి, సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సందర్భాలెన్నో ఉన్నాయి. శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమా సంక్రాంతి బరిలో మెగాస్టార్, బాలయ్యతో పోటీ పడి వచ్చాడు. ఆ సమయంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, బిగ్ హిట్ కొట్టాడు.

ఇటీవల, మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాకి అంతే. వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ రాజా.. ఇరుముడి సినిమాపై విడుదలకి ముందు అంతగా అంచనాలు లేవనే చెప్పాలి. కానీ, ఈ సినిమాలో ఉన్న బలమైన కథ-కథనాలు, రవితేజతో పాటు హీరోయిన్, పాప, సాయి కుమార్‌ల పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫిస్ వద్ద ఊహించని కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. అసలు, మైత్రీకి ఈ సినిమా 250 కోట్ల కలెక్షన్స్ తెస్తుందని ఊహించలేదు.

అయితే, ఎప్పుడైతే అంచనాలు తక్కువ ఉండి కథ నచ్చుతుందో..అప్పుడే సినిమా భారీ సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ వస్తాయి. అదే, ముందే సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చి..ఆ హైప్ కి తగ్గట్టుగా గనక సినిమా లేకపోతే కనీసం పెట్టిన పెట్టుబడి రావాల్సిన సినిమా కూడా డిజాస్టర్‌గా మిగులుతుంది. ఇటీవల వచ్చిన టాక్సిక్ సినిమా పరిస్థితి ఇదే. అంచనాలను విపరీతంగా పెంచేశారు. అందుకు, తగ్గట్టు అసలు సినిమా లేదు. వందల కోట్ల నష్టం వచ్చింది.

అందుకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమాకి అందుకే, హైప్ క్రియేట్ చేయడం లేదట. ఎలాంటి, అంచనాలు లేకుండా గనక వస్తే ఇందులో, ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్, గురూజీ మార్క్ పంచ్ డైలాగ్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేసి సినిమా సక్సెస్‌కి కారణంగా నిలుస్తాయని భావించి..ఆదర్శ కుటుంబం సినిమాకి ముందుగా ఎలాంటి హైప్ రాకుండా జాగ్రత్తపడుతున్నారట. చూడాలి, మరి మేకర్స్ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.

#Aadarsha kutumbam#Venkatesh#Trivikram#Srinidhi Setty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి