Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్–మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ అంతా కలిసి చూడాల్సిన ఈ సినిమాకి ఎలాంటి టికెట్ పెంపు ఉండబోదట.
టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదా?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచడం, అదనపు షోలు వేయడం వంటి నిర్ణయాలు కనిపిస్తుంటాయి. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న పాన్ ఇండియా సినిమాలకి ఈ మధ్య భారీగా టికెట్ రేట్లను పెంచుతున్నారు. ఇటీవల, వచ్చిన నానీ ది ప్యారడైజ్ సినిమాకి ఇలాగే, రేట్లను పెంచారు. అయితే, వెంకీ-శ్రీనిధిల శెట్టిల ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మాత్రం టికెట్ రేట్లను భారీగా పెంచకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే సినిమాను తీసుకురావాలనే ఆలోచన నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ శీనివాస్ సినిమాల్లో కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, వినోదం, బలమైన డైలాగ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. వెంకటేష్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో. దీంతో, వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ముఖ్యంగా, కుటుంబంతో కలిసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. వెంకటేష్‌కు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా తీసుకోనున్న ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెంకటేష్ ఇప్పటి వరకూ చేసిన పవిత్ర బంధం, ప్రేమించుకుందాం..రా, పెళ్లి చేసుకుందాం, కలిసుందాం రా..జయం మనదేరా..రాజా, గణేష్..నువ్వు నాకు నచ్చావ్..మల్లీశ్వరి, సంక్రాంతి, సంక్రాంతికి వస్తున్నాం..ఎఫ్2, ఎఫ్ 3 లాంటి సినిమాలతో తన కెరీర్లో ఎన్నో ఫ్యామిలీ హిట్స్ అందుకున్నారు. మరోవైపు త్రివిక్రమ్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తనదైన స్టైల్లో చెప్పడంలో మంచి పేరు ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఆసక్తి మరింత పెరిగింది. ఇక, ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతుంది? త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి కథను చెప్పబోతున్నారు? కామెడీ, ఎమోషన్, యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అనే ప్రశ్నలకు సినిమా విడుదలయ్యే వరకు సమాధానం దొరకాల్సి ఉంది.


