AP: హరీశ్ చెప్పినదానికి కౌంటర్ ఇచ్చిన జగన్ ! జగన్ రాయసీమ లిఫ్ట్ పై ఏమన్నారంటే
AP: రాయలసీమ లిఫ్ట్ స్కీం చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ రగడపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ హయాంలోనే కేఆర్ఎంబీకి లేఖలు రాసి, రాయలసీమ లిఫ్ట్ పనులను అడ్డుకున్నామని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్ చేసిన నేపథ్యంలో, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అసలు నిజాలను పక్కదారి పట్టిస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Author: Mahesh•26 Nov 2026, 08:19 PM