NBK112: బాలయ్య-కొరటాల సినిమా నుంచి థమన్ అవుట్!
NBK112: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో, ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్బికె112 గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పలు చర్చల తర్వాత ఈ సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజా సమాచారం మేరకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
Author: Anshu•27 Nov 2026, 07:47 PM