సినిమా

NBK112: బాలయ్య-కొరటాల సినిమా నుంచి థమన్ అవుట్!

NBK112: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో, ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్‌బికె112 గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పలు చర్చల తర్వాత ఈ సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజా సమాచారం మేరకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.

ఎన్‌బికే 112 ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయినప్పటి నుంచి సంగీత దర్శకుడి విషయంలో రక రకాల ప్రచారాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అఖండ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ కంటిన్యూ అవుతూ వచ్చాడు. బాలయ్య గత చిత్రం అఖండ 2, ఇప్పుడు చేస్తున్న దాదా చిత్రానికి కూడా థమన్ సంగీత దర్శకుడు. కానీ, ఇటీవల వచ్చిన దాదా ఫస్ట్ సింగిల్ విషయంలో నందమూరి అభిమానులు సంతృప్తి చెందలేదు.

పైగా, ఈ మధ్య థమన్ అందిస్తున్న పాటలపై ట్రోలింగ్, కాపీ క్యాట్ అనే కామెంట్స్ మరీ ఎక్కువైపోయాయి. అతని సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు మ్యాజిక్ చేయడని లేదని అర్థమవుతూనే ఉంది. అందుకే, ఈ సారి బాలయ్య సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చినట్టుగా విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కొరటాలకి ఎక్కువగా సినిమాలు చేసింది దేవిశ్రీప్రసాద్. ఆచార్యకి మణిశర్మ, దేవరకి అనిరుధ్ సంగీతమందించారు. బాలయ్య సినిమాకి కూడా అనిరుధ్ ని ఫైనల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, జీవీ ప్రకాష్ కుమార్ లాకైనట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం. మరి, థమన్ మళ్ళీ బాలయ్య సినిమా ఛాన్స్ అందుకోవాలంటే తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తేనే.

ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దాదా చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గాయమైన కూడా బాలయ్య డే అండ్ నైట్ షూట్‌లో పాల్గొని నిర్మాతలకి సహకరిస్తున్నాడు. గతంలో, గోపీచంద్ మలినేని-బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న దాదాపై అతకంటే రెట్టింపు స్థాయిలో అంచనాలు పెరిగాయి.

తర్వాత చదవండి