Deer Meat: షాద్నగర్లో కృష్ణజింక మాంసం కలకలం.. 9మంది అరెస్ట్
Deer Meat: కృష్ణ జింకను వేటాడి చంపి, దాని మాంసాన్ని ముక్కలుగా చేసి నగరానికి తరలిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను షాద్నగర్ పోలీసులు, ఎస్వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్డ్ తుపాకీ, బుల్లెట్లు, కృష్ణజింక మాంసం, రెండు కార్లు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు.
Author: NK•28 Sep 2026, 09:18 PM