జీవో నెంబర్ 259ను సవరించాలి, బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలి
బోరుబావుల తవ్వకాల రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259ను తక్షణమే సవరించి, ఆచరణ సాధ్యమైన నిబంధనలు అమలు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Author: NK•10 Nov 2026, 06:28 PM