Chukka Ramaiah: చుక్కా రామయ్యకు సమకాలికులు లేరు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం
Chukka Ramaiah: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య శత జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినం అని సీఎం రేవంత్ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర చుక్కా రామయ్యది అని తెలిపారు. ఐఐటీ అనే పదాన్ని రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత చుక్కా రామయ్య అని కీర్తించారు.
Author: NK•20 Nov 2026, 09:54 PM