తెలంగాణ

Chukka Ramaiah: చుక్కా రామయ్యకు సమకాలికులు లేరు- సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

Chukka Ramaiah: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య శత జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినం అని సీఎం రేవంత్ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర చుక్కా రామయ్యది అని తెలిపారు. ఐఐటీ అనే ప‌దాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేసిన‌ గొప్ప విద్యావేత చుక్కా రామ‌య్య‌ అని కీర్తించారు.

Chukka Ramaiah: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య శత జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినం అని సీఎం రేవంత్ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర చుక్కా రామయ్యది అని తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఐఐటీని పరిచయం చేసిన ఘనత

ఐఐటీ అనే ప‌దాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేసిన‌ గొప్ప విద్యావేత చుక్కా రామ‌య్య‌ అని కీర్తించారు. గొప్ప విద్యావేత్తగా, సామాజిక పరివర్తన తీసుకొచ్చిన మహనీయుడిగా చుక్కా రామయ్య వందేళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా భావించాల్సిన సందర్భం అని పేర్కొన్నారు.

విద్యావేత్తగా, ఎమ్మెల్సీగా తనదైన ముద్ర

చుక్కా రామయ్య విద్యావేత్తగానే కాకుండా శాసనమండలి సభ్యుడిగా తనదైన ముద్రను ఈ ప్రాంతంపైన‌ వేశారని రేవంత్ తెలిపారు. ఎమ్మెల్సీగా.. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో కలిసి పని చేయడం తన అదృష్టం అన్నారు సీఎం రేవంత్. ఈ విషయాన్ని తాను గొప్పగా చెప్పుకుంటానని తెలిపారు. సామాజిక సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై ప‌దునైన ప్ర‌శ్న‌ల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి, పరిష్కారం ఏ విధంగా ఉండాలో కూడా చుక్కా రామయ్య సూచించేవారని సీఎం రేవంత్ వెల్లడించారు.

సమస్యలను ప్రస్తావించడంతో పాటు పరిష్కార మార్గాలు చెప్పేవారు

రాజకీయ నాయకులు ఉకదంపుడు ఉపన్యాసాలు కాకుండా సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలని సూచించారు. సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటి పరిష్కార మార్గాలు చెప్పేవారు కొంతమందే ఉన్నారని.. వారిలో చుక్కా రామయ్య ఒకరని సీఎం రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చట్ట సభల్లో పార్టీ బలంతో నిమిత్తం లేకుండా చుక్కా రామయ్య, నాగేశ్వర్ లాంటి వారికి మాట్లాడేందుకు సమయం ఇచ్చేవారని రేవంత్ గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేని విషయాన్ని అప్పట్లో వారు మండలిలో ప్రస్తావించే వరకు ఎవరికీ తెలియదన్నారు. వారి ప్ర‌స్తావ‌న త‌ర్వాతే ప్ర‌భుత్వం ఆ దిశగా ఒక నిర్ణ‌యం తీసుకుందని తెలిపారు.

తెలంగాణలో చుక్కా రామ‌య్య స‌మ‌కాలికులు లేరు

''పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి గొప్ప వ్య‌క్తులు తమ ప్రాంతంలో ఉన్నారని తెలంగాణ ప్ర‌జ‌లు ఎప్పుడూ చెప్పుకుంటారు. కాలం, రాజకీయాలకు వీరు అతీతులు. ప్రజల పట్ల వారికున్న అంకితభావం, చిత్తశుద్ధి వల్ల కొంతమంది విషయంలో రాజకీయ నాయకులంతా ఏకాభిప్రాయంతో ఉంటారు. తెలంగాణలో చుక్కా రామ‌య్య స‌మ‌కాలికులు లేరు. ఆయన అతీతుడు. చుక్కా రామయ్యతో కలిసి చట్టసభల్లో పనిచేయడం నా అదృష్టం. వారి ఆలోచ‌న‌లు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది'' అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

చుక్కా రామయ్య మరింత ఆరోగ్యంతో ఉండి అందరికీ స్ఫూర్తి ఇవ్వాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్.. చుక్కా రామయ్యకి మరోసారి వంద వసంతాల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో తరాలకు దారి చూపిన మహనీయుడు

చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశానని రేవంత్ తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్యది అని కీర్తించారు.

శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించే వారని ప్రశంసించారు. చుక్కరామయ్య నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. చుక్కా రామయ్య వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు, ఎన్నో తరాలకు దారి చూపించారని సీఎం రేవంత్ చెప్పారు. చుక్కారామయ్య ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్.

తర్వాత చదవండి