Telangana Politics: ఎన్నికలకు రెండేళ్ల ముందే కుర్చీపై కర్చీఫ్.. కానీ సొంత పార్టీలోనే అసలు కుట్రలు!
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందో, ఏడాది ముందో హడావిడి మొదలవుతుంది. కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం అప్పుడే పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయనే అంచనాలతో ప్రధాన పార్టీల మహిళా నేతలు రెండేళ్ల ముందే కుర్చీపై కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు.
Author: Mahesh•25 Nov 2026, 07:43 PM