NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో ఉచిత హార్ట్ సర్జరీలు.. ఈ నెల 13 నుంచి..
NIMS: హైదరాబాద్ నిమ్స్ లో (నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. ఆగస్టు 13వ తేదీ నుండి పిల్లల కోసం ఉచిత గుండె శస్త్రచికిత్సల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లండన్‌కు చెందిన డాక్టర్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నాషునేని, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి ఆసుపత్రిలోని సి.టి. (CT) సర్జరీ విభాగం ఈ ప్రత్యేక గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంది.
Author: NK•10 Aug 2026, 05:58 PM