తెలంగాణ
Food Poison: జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థుల ఆవేదన
సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం జోగిపేట ఎస్పీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం విద్యార్థినులు పులిహోర తిన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పులిహోర తిన్న విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. వాంతులు కూడా చేసుకున్నారు. దీంతో విద్యార్థినులను వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Author: NK•25 Nov 2026, 04:06 PM