తెలంగాణ
తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు
TG: బీరువాలో దాచిన స్వెటర్లు, రగ్గులు బయటకు తీయాల్సిన టైం వచ్చేసింది. తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే ఉదయం, రాత్రి వేళల్లో వీస్తున్న చలి గాలులకు జనం గజగజ వణికిపోతుండగా.. వాతావరణ శాఖ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొనడంతో, రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
Author: Mahesh•29 Nov 2026, 09:03 PM