తెలంగాణ

గద్వాల మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగులపై వేటు..

3 నిమిషాల పఠనం

గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్‌ షాపుల అద్దెల రూపంలో వసూలైన రూ.11.28 లక్షలను ఖాతాలో జమ చేయకపోవడం, నిధుల దుర్వినియోగం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశాల మేరకు ఆర్వో రాజేష్ కుమార్, సీనియర్‌ అసిస్టెంట్‌/ఇంచార్జ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజవర్ధన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌/ ఇంచార్జ్‌ ష్రాఫ్ రాజవర్ధన్‌ నాయుడులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Gadwal: గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్‌ షాపుల అద్దెల రూపంలో వసూలైన రూ.11.28 లక్షలను ఖాతాలో జమ చేయకపోవడం, నిధుల దుర్వినియోగం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశాల మేరకు ఆర్వో రాజేష్ కుమార్, సీనియర్‌ అసిస్టెంట్‌/ఇంచార్జ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజవర్ధన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌/ ఇంచార్జ్‌ ష్రాఫ్ రాజవర్ధన్‌ నాయుడులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వసూలైన అద్దె సొమ్మును నిర్ణీత గడువులోగా మున్సిపల్‌ ఖాతాలో జమ చేయకపోవడంతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంలో నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. అద్దె వసూళ్లకు సంబంధించిన రశీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్‌ వివరాలు, లెక్కలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

#Jogulamba Gadwal#Gadwal Municipality#Suspension#Non Remittance#Municipal Shops Rents#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి