తెలంగాణ

మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా మీ వల్లే- ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం రేవంత్

5 నిమిషాల పఠనం

Cm Revanth: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం అని చెప్పారు. పేదల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కార్యాలయం ఉపయోగపడాలని సూచించారు. సమస్యలతో వచ్చిన పేదలకు వెంటనే పరిష్కారం దొరకాలన్నారు.

Cm Revanth: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం అని చెప్పారు. పేదల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కార్యాలయం ఉపయోగపడాలని సూచించారు. సమస్యలతో వచ్చిన పేదలకు వెంటనే పరిష్కారం దొరకాలన్నారు.

ప్రజలకు సాయం చేయటం మన బాధ్యత

సాయం కోసం వచ్చిన వాళ్లను కుటుంబసభ్యుల్లా చూడాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ప్రజల సమస్యలే మన సమస్యలు అని చెప్పిన సీఎం రేవంత్.. సమస్యలతో వచ్చే ప్రజలకు సాయం చేయటం మన బాధ్యత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, దేశ ప్రధానమంత్రికైనా మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బాగా పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.

నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కరీంనగర్ లో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

3శాతం ఉద్యోగస్తులు 97శాతం ప్రజలకు సేవలందిస్తున్నారు

అందరి సహకారంతోనే సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు సీఎం రేవంత్. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రజలకు సేవలు అందిస్తూ వాటిని పరిష్కరించుకోవాలన్నారు. 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 4 కోట్ల ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. 3శాతం మంది ఉద్యోగులు 97శాతం మంది ప్రజలకు సేవ చేయడం శ్రమతో కూడిన పని అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఉద్యోగులు బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు

''రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, దేశ ప్రధానికైనా మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే. ఉద్యోగులు బాగా పని చేస్తే మేము బాగా పని చేస్తున్నామని ప్రజలు చెప్తారు. మీరు సహాయ నిరాకరణ చేసినా, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పని చేయడం లేదంటారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం సహకారం తీసుకోవడంలో మాకేమీ అభ్యంతరాలు లేవు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధిలో కేంద్రంతో కలిసి పని చేస్తాం. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాం. కేంద్రం కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి. ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు ఇవ్వాలి'' అని సీఎం రేవంత్ అన్నారు.

#Cm Revanth Reddy#Karimnagar#Government Employs#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి