ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో మొన్నటివరకు ఆకాశన్నంటిన బంగారం, వెండి ధరలు (Gold, Silver Rates) క్రమంగా పడిపోతున్నాయి. ఇండియాలో బంగారం దిగుమతుల కారణంగా ఫారెక్స్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రధాని మోడీ దేశప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు.. బంగారం దిగుమతులు కొంత మేర తగ్గాయి.దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పెట్టబడిదారులు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీనికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, అక్కడ ద్రవ్యోల్బణం నియంత్రణకు వడ్డీ రేట్లు పెంచవచ్చనే సమాచారం రావడంతో బంగారం, వెండి ధరలు తగ్గడానికి మరోకారణంగా తెలుస్తోంది.అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టినట్టు సమాచారం. మునుపటి గరిష్ఠ స్థాయిల నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ యుద్ధం సమయంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి మీద భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు చమురు ధరలు దిగిరావడంతో బంగారం, వెండి మీద పెట్టిన పెట్టుబడులను విత్ డ్రా చేసుకుని లాభాలను ఆర్జిస్తున్నట్టు తెలిసింది. ఫలితంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా క్రాష్ అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గడంతో తాజాగా హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సుమారు ₹1,23,260 – ₹1,23,270 మధ్య ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సుమారు ₹1,12,990 – ₹1,17,260 మధ్య ఉంది. 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సుమారు ₹92,450 పలుకుతోంది. వెండి (1 కిలో) మార్కెట్ ఆధారంగా సుమారు ₹1,48,140 – ₹1,64,900 మధ్య ఉంది. కాగా, ఆభరణాల కొనుగోలుపై GST, మేకింగ్ ఛార్జీలు, హాల్మార్కింగ్ రుసుములు అదనంగా ఉంటాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
