తెలంగాణ

Hyd: ఆకాశంలో అద్భుతం.. కెమెరాకు చిక్కిన లియోనిడ్ ఉల్కాపాతం!

హైదరాబాద్‌లో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఆకాశంలో ఆవిష్కృతమైన అత్యంత అరుదైన లియోనిడ్ (Leonid) ఉల్కాపాతం దృశ్యాలను నగరంలోని ఔత్సాహిక ఖగోళ పరిశోధకులు తమ కెమెరాలలో విజయవంతంగా బంధించారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ ఉల్కాపాతం తారస్థాయికి చేరుకున్న సమయంలో ఏకంగా 87ఉల్కల కదలికలను స్పష్టంగా రికార్డ్ చేసినట్లు వారు తాజాగా ప్రకటించారు. న

హైదరాబాద్‌లో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఆకాశంలో ఆవిష్కృతమైన అత్యంత అరుదైన లియోనిడ్ (Leonid) ఉల్కాపాతం దృశ్యాలను నగరంలోని ఔత్సాహిక ఖగోళ పరిశోధకులు తమ కెమెరాలలో విజయవంతంగా బంధించారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ ఉల్కాపాతం తారస్థాయికి చేరుకున్న సమయంలో ఏకంగా 87ఉల్కల కదలికలను స్పష్టంగా రికార్డ్ చేసినట్లు వారు తాజాగా ప్రకటించారు. నగరంలోని షేక్‌పేట్ ప్రాంతంలో ఉన్న 'స్టార్ గేజర్స్ టెర్రస్ అబ్జర్వేషన్ స్టేషన్' కేంద్రంగా ఈ అద్భుతమైన ఖగోళ వింతను అత్యంత స్పష్టతతో చిత్రీకరించారు.

 ఏటా నవంబర్ మాసంలో భూమి తన కక్ష్యలో తిరుగుతూ '55పి/టెంపుల్-టటిల్' (55P/Tempel-Tuttle) అనే తోకచుక్క వదిలివెళ్లిన ధూళి మేఘాల గుండా ప్రయాణించడం వల్ల ఈ లియోనిడ్ ఉల్కాపాతం సంభవిస్తుంది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ఈ ఉల్కా శకలాలు సెకనుకు సుమారు 70 కిలోమీటర్ల అత్యధిక వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఖగోళ ప్రపంచంలో వీటిని అత్యంత వేగవంతమైన ఉల్కలుగా పరిగణిస్తారు. ఈ వేగవంతమైన దృశ్యాలను ఒడిసిపట్టేందుకు స్టార్ గేజర్స్ ప్రతినిధి సయ్యద్ విలాయత్ హుస్సేన్, యూకే నుంచి ప్రత్యేకంగా తెప్పించిన నాలుగు 'టాపోస్ సి325 డబ్ల్యూబీ వి2' (Tapo C325WB V2) సీసీటీవీ కెమెరాలను వినియోగించారు.

 నవంబర్ 17వ తేదీ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి 18వ తేదీ వేకువజాము వరకు ఆకాశంలో ఉల్కల వర్షం అత్యధిక స్థాయిలో దర్శనమిచ్చింది. ముఖ్యంగా నవంబర్ 18 తెల్లవారుజామున 5:15 గంటల సమయంలో ఈ ప్రక్రియ గరిష్ఠ దశకు చేరుకుంది. ఆ సమయంలో గంటకు సగటున 15 ఉల్కల వరకు కనువిందు చేసే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

 తెల్లవారుజాముకు ముందే చందమామ అస్తమించడంతో గగనతలం పూర్తిగా చీకటిగా, నిర్మలంగా మారి ఉల్కలను స్పష్టంగా వీక్షించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. సాధారణంగా ఈ లియోనిడ్ ఉల్కాపాతం ప్రభావం నవంబర్ నెలాఖరు వరకు కొనసాగినప్పటికీ, గరిష్ఠ స్థాయి దాటిన తర్వాత ఆకాశంలో మెరిసే ఉల్కల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఏడాది చివరిలో భాగంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో అంతరిక్షంలో చోటుచేసుకునే పలు ఖగోళ వింతలను తిలకించేందుకు హైదరాబాద్ నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

తర్వాత చదవండి