Samantha: సమంత పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోస్ మాత్రమే కాదు.. ఫిట్‌నెస్, స్టైల్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తీరు కూడా. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్‌లో స్వయంగా సమంత గర్భంతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది.
దర్శక నిర్మాత..రచయిత అయిన రాజ్ నిడుమోరుతో సమంత రెండవ వివాహం జరిగింది. ఆ తర్వాత భర్త నిర్మాణ సంస్థలో బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమాను చేసింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వచ్చిన మా ఇంటి బంగారం 100 కోట్ల మార్క్‌ను దాటి..సమంత స్టామినాను తెలియజేసింది.
అయితే, ఈ సినిమా రిలీజ్ సమయానికి సమంత ప్రగ్నెంట్. తసాదియ్యా సాంగ్ షూటింగ్ సమయంలో ఈ విషయం తెలిసింది. అయినా, కూడా ఎంతో హుషారుగా సాంగ్ మాత్రమే కాకుండా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం, సమంత మెటర్నిటీ లీవ్‌లో ఉంది.
అయినా కూడా క్రమం తప్పకుండా వ్యాయామం, ఫొటో షూట్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రగ్నెంట్ సమయంలో ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత హెల్దీగా ఉండటంతో పాటు...నార్మల్ డెలివరీ అవడానికి అన్ని విధాలా బాడి సహకరిస్తుంది. కాబట్టే, రొటీన్ గా చేసుకునే పనులను సమంత ఎంతమాత్రం వాయిదా వేయడం లేదు. తాజాగా, సరికొత్త ఫొటో షూట్స్‌కి సంబందించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో, సమంత బేబీ బంప్ చాలా స్పష్టంగా తెలుస్తోంది.


