తెలంగాణ

TG: 8 కుటుంబాలు.. 14 ఏండ్లు బానిసలు.. అప్పు పేరుతో అన్యాయం చేసిన దుర్మార్గుడు..

TG: సినిమాల్లో మాత్రమే చూసే వెట్టిచాకిరీ, బానిస బతుకులు ఇంకా సమాజంలో సజీవంగానే ఉన్నాయని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టింది. అప్పు పేరుతో ఉచ్చు బిగించి, ఏకంగా 8 కుటుంబాలను 14 ఏళ్ల పాటు నరకయాతనకు గురిచేసిన ఓ సిమెంట్ ఇటుకల కేంద్రం యజమాని దుర్మార్గం తాజాగా బయటపడింది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బందీలుగా మారిన 37 మందికి ఎట్టకేలకు అధికార యంత్రాంగం విముక్తి కల్పించింది.నెల్లూరు జిల్లాకు చెందిన 8 దళిత కుటుంబాలు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల కిందట హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రంలో పనికి చేరాయి. ఆ సమయంలో యజమాని వారికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. ఆ కొద్దిపాటి అప్పే వారి పాలిట శాపంగా మారింది. అప్పు తీరలేదంటూ వారిని అక్కడే బందీలుగా మార్చేశాడు.