National

పంజాబ్ లో పాతమిత్రులు.. యూపీలో తెగని లెక్కలు! 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. పంజాబ్‌లో ఆరేళ్లుగా దూరంగా ఉన్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మరోసారి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.