తెలంగాణ

HYD : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర..

జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ హత్యకు కొందరు కుట్ర చేసినట్టు తెలిసింది. నిందితుల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నట్టు సమాచారం.అయితే, ఈ హత్య కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ, స్వరాజ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్, ఫయాజ్ ఖాన్, బోరబండ, పద్మావతి నగర్‌‌కు చెందిన దేవర రాజా, బోరబండ సైట్-3 నివాసి అయిన సయ్యద్ హాదీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర పన్నారు. ఇమ్రాన్ ఖాన్, అతడి సోదరుడు ఫయాజ్ ఖాన్‌.. నెల రోజుల కిందట మహ్మద్ కాషిఫ్ మిస్బా, షేక్ నవాజ్‌లను సంప్రదించినట్టు తెలిసింది. బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేయడానికి రూ.25 లక్షల వరకు సుపారీ ఆఫర్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.