తెలంగాణ
Hyderabad Metro Rail: భాగ్యనగరంలో దశాబ్దపు విప్లవం.. హైదరాబాద్ మెట్రోకు పదేళ్లు!
హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన మెట్రో రైలు ప్రస్థానం నేటితో దిగ్విజయంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయే నగరవాసులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ, మెట్రో రైలు హైదరాబాద్ జీవనశైలిలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు నగర రవాణా వ్యవస్థలో మెట్రో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ముందుకు సాగుతోంది.
