తెలంగాణ

Hyderabad Metro Rail: భాగ్యనగరంలో దశాబ్దపు విప్లవం.. హైదరాబాద్ మెట్రోకు పదేళ్లు!

హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన మెట్రో రైలు ప్రస్థానం నేటితో దిగ్విజయంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయే నగరవాసులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ, మెట్రో రైలు హైదరాబాద్ జీవనశైలిలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది.

హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన మెట్రో రైలు ప్రస్థానం నేటితో దిగ్విజయంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయే నగరవాసులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ, మెట్రో రైలు హైదరాబాద్ జీవనశైలిలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది.

 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు నగర రవాణా వ్యవస్థలో మెట్రో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ముందుకు సాగుతోంది.

100 కోట్ల మైలురాయి.. నిత్యం లక్షలాది మందికి ఆధారం

గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ మెట్రో సాధించిన ప్రగతి అసాధారణం. ఈ దశాబ్ద కాలంలో ఏకంగా 100కోట్ల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చి మెట్రో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 5లక్షల మంది నగరవాసులు తమ దైనందిన కార్యకలాపాల కోసం మెట్రో సేవలను వినియోగించుకుంటుండటం విశేషం.

విస్తృతమైన నెట్‌వర్క్.. 3 కారిడార్లలో పరుగులు

నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రో మొత్తం 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మూడు కారిడార్లలో భాగంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, అలాగే ఎంజీబీఎస్ (MGBS) నుంచి జేబీఎస్ (JBS) రూట్‌లలో ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

నిరంతరాయంగా 1100 ట్రిప్పులు

మూడు కారిడార్ల పరిధిలో మొత్తం 57 ఆధునిక మెట్రో స్టేషన్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లు ప్రతిరోజూ మూడు మార్గాల్లో కలిపి సుమారు 1100 ట్రిప్పులు నడుస్తూ, నగరవాసుల సమయాన్ని ఆదా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తూ, హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో రైలు ఒక కీలక చోదక శక్తిగా నిలిచింది.

తర్వాత చదవండి