స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana : రైతుల ధాన్యంపై దొంగల రాజ్యం?

ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల్లో ఒకరికి అవినీతి మరకలు అంటితే, మరొక్కరు నిజాయితీగా పని చేసినందుకు అయ్యారని టాక్. కీలక ఐపీఎస్ పని తీరుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక బదిలీ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు ధాన్యం సిండికేట్ కింగ్ పిన్ అయిన అనాటి హాకా ఛైర్మన్, ఈనాటి మంత్రి ప్రధాన అనుచరుడు మచ్చ శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపుతోంది.

అరెస్టులు చేస్తే ఒప్పుకోలేని ‘ఉత్తమ’ మంత్రి?

రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ వరుస బెట్టి కేసులు పెడుతుంటే దోపిడీదారులు జీర్ణించుకోలేక పోయారు.కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) బకాయిలు, సన్నబియ్యం దారి మళ్లింపు, బియ్యం కృత్రిమ కొరతపై గత కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దాడులు చేశారు. రూ.1,500 కోట్ల బకాయిల్లో ఆయన ప్రభుత్వానికి చెల్లింపులు చేశారు. బకాయిలు చెల్లించని వారిపై కేసులు నమోదు చేయించారు. వారంతా ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఒక యూట్యూబర్‌తో వివిధ ఉద్యమాలను క్రియెట్ చేశారు. ముస్లిం మిల్లర్లకు సపోర్ట్‌గా ప్రచారం చేశారని టాక్.