స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana : రైతుల ధాన్యంపై దొంగల రాజ్యం?

ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల్లో ఒకరికి అవినీతి మరకలు అంటితే, మరొక్కరు నిజాయితీగా పని చేసినందుకు అయ్యారని టాక్. కీలక ఐపీఎస్ పని తీరుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక బదిలీ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు ధాన్యం సిండికేట్ కింగ్ పిన్ అయిన అనాటి హాకా ఛైర్మన్, ఈనాటి మంత్రి ప్రధాన అనుచరుడు మచ్చ శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపుతోంది.

-దోపిడీ వ్యవస్థకు మంత్రి ఉత్తమ్ రెడ్డి మద్దతు?

-కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సిండికేట్ టెండర్స్?

-చక్రం తిప్పిన మచ్చ శ్రీనివాసరావు?

- ఆనాటి నుంచి ఈనాటి అధికారుల బదిలీలు

- సుప్రీంకోర్టులో చుక్కెదురు

- అక్రమ సంపాదనతో అధికారులను బదిలీ చేయించిన వైనం

- ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర బదిలీ వెనుక మిల్లర్ల హస్తం?

- గింజ గింజకు కష్టపడే రైతన్న కష్టాన్ని దోచుకున్న తీరుపై ‘స్వేచ్ఛ న్యూస్’ ప్రత్యేక కథనం

- దోపిడీతత్వం.. దొంగలకే పెత్తనం పార్ట్ -1

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ చైర్మన్

9848070809

స్టీఫెన్ బదిలీ వెనక రాజకీయం?

ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల్లో ఒకరికి అవినీతి మరకలు అంటితే, మరొక్కరు నిజాయితీగా పని చేసినందుకు అయ్యారని టాక్. కీలక ఐపీఎస్ పని తీరుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక బదిలీ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు ధాన్యం సిండికేట్ కింగ్ పిన్ అయిన అనాటి హాకా ఛైర్మన్, ఈనాటి మంత్రి ప్రధాన అనుచరుడు మచ్చ శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపుతోంది.

అరెస్టులు చేస్తే ఒప్పుకోలేని ‘ఉత్తమ’ మంత్రి?

రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ వరుస బెట్టి కేసులు పెడుతుంటే దోపిడీదారులు జీర్ణించుకోలేక పోయారు.కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) బకాయిలు, సన్నబియ్యం దారి మళ్లింపు, బియ్యం కృత్రిమ కొరతపై గత కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దాడులు చేశారు. రూ.1,500 కోట్ల బకాయిల్లో ఆయన ప్రభుత్వానికి చెల్లింపులు చేశారు. బకాయిలు చెల్లించని వారిపై కేసులు నమోదు చేయించారు. వారంతా ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఒక యూట్యూబర్‌తో వివిధ ఉద్యమాలను క్రియెట్ చేశారు. ముస్లిం మిల్లర్లకు సపోర్ట్‌గా ప్రచారం చేశారని టాక్. 26 జిల్లాల్లో 300 రైస్ మిల్లులపై తనిఖీలు జరిగాయి. రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వలకు, మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా బయటపడింది. దీని విలువ సిండికేట్ టెండర్స్ విలువైన రూ.2 వేల కోట్లు. ఈ వ్యవహారంలో మూడు నెలల క్రితం వరకు సుమారు రూ.700 కోట్లు రాబట్టారు.ఇది రూ.1,500 కోట్ల వరకు చేరాయి.

సన్న ధాన్యాన్ని అమ్ముకున్నారు

11 జిల్లాలకు చెందిన వ్యాపారులు సన్న ధాన్యాన్నిఅమ్ముకున్నారు. వీటి స్థానంలో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారు. ఈ వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదు అందింది. 25 కిలోలు ఉండాల్సిన బస్తాను 26 కిలోలు చూపించడం. అధిక ధరగా సిక్టర్స్ అతకించడంతో 35 మంది వ్యాపారులపై క్రిమనల్ కేసులు నమోదు అయ్యాయి.వారం రోజుల్లోనే ఈ కేసులు నమోదు కావడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గిట్టుబాటు కాలేదని సమాచారం. దీంతో రవీంద్రను బదిలీ చేశారని బహిరంగంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కమిషనర్ అవినీతికి మంచి పోస్టింగ్ ఇచ్చినా, స్టీఫెన్‌కు మాత్రం రాష్ట్రంలో టార్చ్‌లైట్ పెట్టినా ఎక్కడ కూర్చోవాలో తెలియని పొస్టింగ్‌కి బదిలీ చేయించారు.

హైకోర్టు చెప్పినా బుద్ధి రాలే.. సుప్రీంకోర్టు సమర్ధించింది

రైతన్న కష్టాలను దోచుకుంటున్న మిల్లర్స్, పేదలకు బియ్యం ఇవ్వకుండా అమ్ముకున్నారు. ధాన్యం టెండర్స్ పక్రియలో రూ.వేల కోట్ల సిండికేట్ వ్యవహారం జరిగింది. 2021 నుంచి ధాన్యం కేటాయింపుల్లో రూ.7 వేల కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు పౌరసరఫరా శాఖ గుర్తించింది. అందుకు విజిలెన్స్, సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. దీని ఫలితంగా రూ.2 వేల కోట్ల ధాన్యం పూర్తిగా గల్లంతైందని తెలింది. 63 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 25 మందిని అరెస్ట్ చేశారు. దీంతో 300 మందికి పైగా హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దశల వారీగా 550 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆదేశాలనే సమర్ధిస్తూ వాళ్లు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.

రేఖా నాయక్‌పై ఈడీ దాడులు.. వాళ్లందరిపై ఎందుకు లేవు?

రూ.45 కోట్ల ధాన్యం స్కాంలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై ఈడీ దాడులు చేసింది. కానీ, రూ.7 వేల కోట్ల స్కాం చేసిన వారిపై ఎందుకు ఈడీ దృష్టి పెట్టడం లేదు. సీఐడీ కేసులను ఎందుకు తీసుకోవడం లేదు. ఇదో డోపిడీ రాజ్యం దొంగల వ్యవస్థ అని ‘స్వేచ్ఛ న్యూస్’ సవాల్ విసురుతోంది. నిరూపించుకునే దమ్ము మిల్లర్లకు, మంత్రి ఉత్తమ్‌కు ఉందా?

దొంగలకే పెత్తనం పార్ట్-2లో..

దోపిడీ రాజ్యంలో ఏపీ ప్రభుత్వ లాలూచీలకు అలవాటు పడ్డ అధికారులను తమిళనాడు తొలగించింది.తెలంగాణ ఎప్పుడు కళ్లు తెరుస్తుంది.

తర్వాత చదవండి