తెలంగాణ

ACB: రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ADE

ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ సర్కిల్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా (ADE) పనిచేస్తున్న రమేష్ బాబు రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బిల్లులు చెల్లించాలంటే లంచం ఇవ్వాల్సిందేనని రమేష్ బాబు కాంట్రాక్టర్ ని డిమాండ్ చేశాడు. అధికారి తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.