TG: నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. చనిపోయిన రోగుల పేర్లతో బిల్లులు!
G: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు చేసిన సోదాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ తనిఖీలపై అధికారులు రిలీజ్ చేసిన ప్రకటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పేదలకు అండగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.టీజీ సేఫ్, డ్రగ్ కంట్రోల్, లేబర్ శాఖల ఆఫీసర్స్‌తో కలిసి ఏసీబీ బృందం నిమ్స్‌లో తనిఖీలు చేసింది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పేషంట్స్ చికిత్స బిల్లుల విషయంలో జరిగిన గోల్మాల్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. రోగులు చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కూడా వారి పేర్లతో బిల్లులు ప్రాసెస్ చేసినట్లు ఈ తనిఖీలో బయటపడింది. అంతేకాకుండా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులు క్లెయిమ్ చేసే ప్రయత్నం జరిగినట్లు ఈ ప్రకటనలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
