రాజకీయాలు

Congress : నేడు ఏఐసీసీ చీఫ్ రాక.. ఎజెండా టీపీసీసీ కసరత్తు!

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్ నేడు తెలంగాణకు రానున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో జరిగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం జరగనుంది. అందులో నూతన ఏఐసీసీ స్టేట్ ఇన్చార్జి పాల్గొంటారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్టు సమాచారం.ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆధ్వర్యంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ, విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.