తెలంగాణ

Pulse Polio Drive 2026: అలర్ట్.. ఐదేళ్లలోపు చిన్నారులకు నేడు పోలియో చుక్కలు

 పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID-2026)లో భాగంగా ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆదివారం (నవంబర్ 22) ఉదయం 7 గంటల నుంచే హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) వేసే ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలియో బూత్‌లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని అధికారులు కోరారు.