Spirituality

హిందూ సమాజం బలపడితేనే దేశం బలపడుతుంది- పగుడాకుల బాలస్వామి

Pagadakula Balaswamy: కులాలు, ప్రాంతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్‌లో సభ్యత్వం తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఐక్యంగా, సంఘటితంగా ఉన్నప్పుడే ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోగలమని స్పష్టం చేశారు. కులాల పేరుతో, రాజకీయాల పేరుతో పరస్పరం విడిపోకుండా విభేదాలను పక్కనపెట్టి హిందువులందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.