Pagadakula Balaswamy: కులాలు, ప్రాంతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్‌లో సభ్యత్వం తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఐక్యంగా, సంఘటితంగా ఉన్నప్పుడే ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోగలమని స్పష్టం చేశారు. కులాల పేరుతో, రాజకీయాల పేరుతో పరస్పరం విడిపోకుండా విభేదాలను పక్కనపెట్టి హిందువులందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
మూడేళ్లకు ఒకసారి నిర్వహించే విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో పగుడాకుల బాలస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు ఆవశ్యకతను వివరించారు.
హిందూ సమాజ ఐక్యతే దేశానికి బలం
హిందువులు సంఘటితంగా లేకపోవడం వల్లనే భారతదేశం అనేక ముక్కలుగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు నాయకులు హిందూ సమాజ ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. హిందువులందరూ ఐక్యంగా ఉంటేనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.
కాశ్మీర్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడులు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. గత ఏడాది బట్టలు విప్పి మరీ.. హిందువులను.. వాళ్ళ కుటుంబసభ్యులు ఎదుటే కాల్చి చంపిన సంఘటన ప్రతి హిందువుకు హెచ్చరిక లాంటిదన్నారు. హిందూ సమాజం సంఘటితంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని అన్నారు.

ధర్మరక్షణ ప్రతి హిందువు బాధ్యత
హిందూ సమాజంలో చైతన్యం పెంపొందించడంతో పాటు మతమార్పిడులను అడ్డుకోవడం, గోహత్యలను నిషేధించేలా కృషి చేయడం, దేవాలయాల పరిరక్షణకు పాటుపడటం, దేవాలయాల వైభవాన్ని పునరుద్ధరించడం, ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిల మానప్రాణాలను దోచుకుంటున్న దుర్మార్గపు రాక్షస క్రీడపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి హిందువు బాధ్యతగా భావించాలని బాలస్వామి పిలుపునిచ్చారు.
కులాల పేరుతో హిందువుల మధ్య ఏర్పడుతున్న అంతరాలను తొలగించి సామాజిక సమరసతను పాటించాలని, ప్రతి ఒక్కరినీ సోదరభావంతో గౌరవించాలని సూచించారు. ప్రేమ పేరుతో మోసపూరిత సంబంధాల ద్వారా హిందూ యువతుల జీవితాలకు నష్టం కలగకుండా అవగాహన కల్పించాలని, మహిళల గౌరవం, భద్రత, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
హిందూ సమాజం బలపడితేనే దేశం బలపడుతుంది
సెక్యులరిజం పేరుతో హిందూ సమాజ ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేసిన బాలస్వామి.. హిందువులు తమ హక్కులు, ధార్మిక స్వేచ్ఛ, సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో సంఘటితంగా గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ సమాజం ఐక్యత, సామాజిక సమరసత, ధర్మరక్షణ, సేవా కార్యక్రమాలే విశ్వహిందూ పరిషత్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రతి హిందువు పరిషత్ సభ్యత్వం స్వీకరించి ధర్మరక్షణ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో VHP కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవి, నాయకులు సత్యనారాయణ, బొక్కి సాయిలు, సత్యప్ప, ఎంగలి సిద్ధూ తదితరులతో పాటు భజరంగ్‌దళ్, గోరక్ష విభాగాల కార్యకర్తలు పాల్గొన్నారు.
భవదీయ
పగుడాకుల బాలస్వామి
ధర్మాచార్య సంపర్క ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010
