Cancer cure Immune system : క్యాన్సర్‌ను గుర్తుపెట్టుకుని అంతం చేసే రోగనిరోధక శక్తి!
మనిషి శరీరంలో రోగనిరోధక శక్తికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదే లేకపోతే నిత్యం జబ్బుల బారిన పడి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే చాన్స్ ఉంది. అయితే, ఈ రోగనిరోధకశక్తికి ప్రత్యేకంగా మొమెరీ పవర్ ఉంటుందని, గతంలో దాడి చేసిన సూక్ష్మజీవులను గుర్తుపెట్టుకుని, అవి మళ్లీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వేగంగా స్పందించి వాటిపై ఎదురుదాడి చేసి చంపేశాయని సైంటిస్టులు తాజా పరిశోధనలో గుర్తించారు. అయితే, ఇదే తరహా జ్ఞాపకశక్తిని క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా కూడా బలోపేతం చేయవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ 'రీజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్' శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్‌ను అంతం చేసే మందులు, కొత్తగా రూపొందించిన ఒక ప్రయోగాత్మక యాంటీబాడీని (Antibody)ని కలిపి శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారు.
