టాప్ న్యూస్

Gen Z LifeStyle : బిల్డప్ కోసం చేతిలో ఐఫోన్.. బికారీ జీవితం!

‘జెన్ జీ’ గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వారు తలచుకుంటే ఏదైనా చేయగలరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలను నిలబెట్టలన్నా, కూల్చాలన్నా వారితోనే సాధ్యం అవుతుందని, జెన్ జీని తక్కువ అంచనా వేయొద్దని, అందుకే ప్రభుత్వాలు వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, జెన్ జీ స్వయంగా చేతులారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొత్త వాదనలూ వినిపిస్తున్నాయి. సోనూ శర్మ అనే లైఫ్ కోచ్.. జెన్ జీల బిహేవియర్, లైఫ్ స్టైల్ (Gen Z LifeStyle) మీద కామెంట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. జెన్‌ జీ చేతుల్లో రూ.లక్షలు విలువ చేసే ఐఫోన్‌ (iPhone) ఉంటున్నాయని, కానీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.వెయ్యి కూడా ఉండటంలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్ ‌స్టా గ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నా పక్కన కూర్చుని మాట్లాడేందుకు కనీసం నలుగురు ఫ్రెండ్స్ ఉండటం లేదన్నారు. గూగుల్‌లో ప్రతిప్రశ్నకూ సమాధానం దొరుకుతున్నా.. జెన్ జీకి ఏం చేయాలో క్లారిటీ ఉండటం లేదన్నారు. జెన్‌ జీ తరం ఏదైనా అనుకుంటే చేసే సత్తా ఉన్నప్పటికీ 5 అలవాట్లు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని స్పష్టంచేశారు.