సినిమా
AOT: దుల్కర్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్..గీతా ఆర్ట్స్‌లో సెలబ్రేషన్స్
AOT: సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరింది. అభిరుచి గల దర్శకుడు పవన్ సాదినేని డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆకాశంలో ఒక తార.. ఈ వారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుంచి అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, సినీ లవర్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలున్న ఈ సినిమాకి, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా సెలబ్రేషన్స్ జరిపారు. కార్యక్రమంలో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ముఖ్యంగా, దర్శకుడు పవన్ సాదినేని ఆనందానికి అవధులేకుండా పోయాయి.
