AOT: సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరింది. అభిరుచి గల దర్శకుడు పవన్ సాదినేని డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆకాశంలో ఒక తార.. ఈ వారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుంచి అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, సినీ లవర్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలున్న ఈ సినిమాకి, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా సెలబ్రేషన్స్ జరిపారు. కార్యక్రమంలో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ముఖ్యంగా, దర్శకుడు పవన్ సాదినేని ఆనందానికి అవధులేకుండా పోయాయి.
తెలుగులో పవన్ సాదినేని మిగతా దర్శకుల మాదిరిగా పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమాలంటూ కాకుండా, ఆయన అభిరుచికి తగ్గ కథ మీద కొన్నేళ్ళ తరపడి శ్రమించి, రీసెర్చ్ చేసి రూపొందించిన ఈ ఆకాశంలో ఒక తార విడుదలైన అన్నీ ప్రాంతాల నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో ఇది స్ట్రైట్‌గా మూడవ హిట్ చిత్రం. ఇక, ఈ సినిమాతోనే తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.
సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటుంది..ముందు దర్శకుడు పవన్ సాదినేని గురించే. ఆయన అనుకున్న కథకి తగ్గ హీరో, హీరోయిన్లను ఎంచుకోవడంలోనే సగం విజయం సాధించాడని చెప్పుకుంటున్నారు. ప్రతీ దర్శకుడికి ఓ కల ఉంటుంది. పెద్ద నిర్మాతలతో మనసుకు నచ్చిన కథను ప్రేక్షకులకి చేర్చాలని. ఆ ప్రయాణంలో పవన్ సాదినేని విజయం సాధించాడు.
ఈ వారం విడుదలైన సినిమాలలో ఆకాశంలో ఒక తారకే మెజారిటీ భాగం ఆడియన్స్ ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఎన్ని వందల కోట్లు రాబడుతుందో చెప్పలేము గానీ, ఆ కోట్ల విలువకంటే కూడా ఓ గొప్ప చిత్రాన్ని మాత్రం పవన్ సాదినేని సినిమా అంటే ప్రేమాభిమానులున్న ప్రతీ ప్రేక్షకుడికి మర్చిపోలేని అనుభూతినిచ్చాడు. హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో నింపేసిన ఆకాశంలో ఒక తార సినిమాను ప్రేక్షకులు ఇప్పుడు ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు.
దుల్కర్.. సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో నేరుగా తెలుగులో రెండు సూపర్ హిట్స్ అందుకోగా..ఇప్పుడు పవన్ సాదినేని కలల చిత్రం ఆకాశంలో ఒక తారతో మూడవ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు, టాలీవుడ్‌తో పాటు మిగతా సౌత్ భాషలలో వినిపిస్తున్న మూడు పేర్లు..ఒకటి దర్శకుడు పవన్ సాదినేని..రెండు దుల్కర్ సల్మాన్..మూడు సాత్విక వీరవల్లి.
