తెలంగాణ
ఆయన అలా, ఈయన ఇలా! ఏపీ జలదోపిడీ అంశంలో బయటపడ్డ రేవంత్ రెడ్డి కుట్ర!
AP TG: నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ (పల్నాడు వాటర్ గ్రిడ్) వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఒకలా, తెలంగాణ ఈఎన్ సీ మరోలా చెప్పడం అనేక సందేహాలకు తావిచ్చింది. తీవ్ర వివాదాలకు తెరలేపిన ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
