తెలంగాణ

AP TG: ఆయన అలా, ఈయన ఇలా! ఏపీ జలదోపిడీ అంశంలో బయటపడ్డ రేవంత్ రెడ్డి కుట్ర!

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ ఒకలా, తెలంగాణ ఈఎన్ సీ మరోలా చెప్పడం అనేక సందేహాలకు తావిచ్చింది. తీవ్ర వివాదాలకు తెరలేపిన ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

AP TG: నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ (పల్నాడు వాటర్ గ్రిడ్) వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ ఒకలా, తెలంగాణ ఈఎన్ సీ మరోలా చెప్పడం అనేక సందేహాలకు తావిచ్చింది. తీవ్ర వివాదాలకు తెరలేపిన ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశంలో ఈ ప్రాజెక్టుపై వాడీవేడిగా చర్చ జరిగిందని తెలంగాణ ఇంజనీర్లు చెబుతుంటే, అసలు సమావేశంలో ఆ ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు సమావేశంలో ఏం జరిగింది? ఎవరి మాటల్లో వాస్తవం ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణ ఈఎన్‌సీ ఓలేటి రమేష్ బాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రతిపాదించిన ప్రాజెక్టును తెలంగాణ అంగీకరించబోదని, ఆ ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. అయితే ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి మాత్రం సమావేశంలో పాల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై చర్చ జరగలేదని మీడియాకు చెప్పడం గమనార్హం. కేఆర్ఎంబీ సమావేశంపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు భిన్నమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలంగాణ చెబుతుంటే, చర్చే జరగలేదని ఏపీ అధికారి చెప్పడంపై అనేక సందేహాలకు తావిస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తీవ్ర వివాదాలకు తెరలేపిన ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని అంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకు ప్రయత్నిస్తోందని ప్రశ్నిస్తున్నాయి. మొత్తంగా ప్రాజెక్టు వివాదం కంటే ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారుల చేసిన ప్రకటనల మధ్య వైరుధ్యం కొత్త చర్చకు దారితీసింది.

కేఆర్ఎంబీ సమావేశం తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలు ఏంటంటే.. KRMB సమావేశంలో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై చర్చ జరిగిందా? లేదా?.. తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరాలు తెలిపారా?.. ఏపీ ఈఎన్‌సీ ఎందుకు భిన్నమైన ప్రకటన చేశారు?... సమావేశంలో జరిగిన చర్చల వివరాలను KRMB అధికారికంగా వెల్లడిస్తుందా?

తర్వాత చదవండి