Health

Health Tip : ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా? ఐతే మీ పని ఖతం!

కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయం లేవగానే చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం దెబ్బతినే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజును ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించడానికి ఉదయం లేవగానే ఈ పనులు అస్సలే చేయొద్దు. అప్పుడే ఆ రోజంతా కూల్ మైండ్‌తో పనులు చకాచకా చేయొచ్చని నిపుణులు వెల్లడించారు.అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

లేవగానే ఫోన్ చూడొద్దు..

నిద్రలేచిన వెంటనే కొందరు సోషల్ మీడియా, మెసేజ్‌లు లేదా వార్తలు చూస్తుంటారు. అలా చేయడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది. ఇది ఆందోళన (Anxiety), ఒత్తిడికి దారితీసి, రోజంతా ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుంది. కనీసం మొదటి 20–30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఉదయం పూట వచ్చే నోటిఫికేషన్లు, వార్తలు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను పెంచి, రోజంతా తెలియని కంగారు లేదా చిరాకును కలిగిస్తాయి. రోజు ప్రారంభంలోనే మెదడుకు అధిక సమాచారం అదించడం వలన ముఖ్యమైన పనులపై దృష్టి మళ్లుతుంది. ఇది క్రమంగా అలవాటుగా మారి నిద్ర నాణ్యత కూడా దెబ్బతినే చాన్స్ ఉంది.