కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయం లేవగానే చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం దెబ్బతినే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజును ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించడానికి ఉదయం లేవగానే ఈ పనులు అస్సలే చేయొద్దు. అప్పుడే ఆ రోజంతా కూల్ మైండ్‌తో పనులు చకాచకా చేయొచ్చని నిపుణులు వెల్లడించారు.అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
లేవగానే ఫోన్ చూడొద్దు..
నిద్రలేచిన వెంటనే కొందరు సోషల్ మీడియా, మెసేజ్‌లు లేదా వార్తలు చూస్తుంటారు. అలా చేయడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది. ఇది ఆందోళన (Anxiety), ఒత్తిడికి దారితీసి, రోజంతా ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుంది. కనీసం మొదటి 20–30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఉదయం పూట వచ్చే నోటిఫికేషన్లు, వార్తలు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను పెంచి, రోజంతా తెలియని కంగారు లేదా చిరాకును కలిగిస్తాయి. రోజు ప్రారంభంలోనే మెదడుకు అధిక సమాచారం అదించడం వలన ముఖ్యమైన పనులపై దృష్టి మళ్లుతుంది. ఇది క్రమంగా అలవాటుగా మారి నిద్ర నాణ్యత కూడా దెబ్బతినే చాన్స్ ఉంది.
బెడ్‌పై నుంచి హడావిడిగా లేవడం
రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరానికి, మెదడుకు ఒక్కసారిగా లేవడం వల్ల రక్తపోటులో చిన్న మార్పులు వచ్చి తల తిరగడం లేదా నీరసం అనిపించడం జరగవచ్చు. అందుకే నిద్రలేచే ముందు కొద్దిసేపు మంచం మీద కూర్చుని, శ్వాస తీసుకుని, ఆ తర్వాతే నిదానంగా లేవాలి.ఒక్కసారిగా లేచినప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా తగ్గితే కళ్లు తిరగడం లేదా బ్యాలెన్స్ తప్పడం జరగవచ్చు. ముఖ్యంగా వయసు పైబడిన వారు లేదా లో-బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రంతా కదలకుండా ఉన్న కండరాలు, వెన్నుపూసపై ఒక్కసారిగా ఒత్తిడి పడి నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
టీ లేదా కాఫీ తాగుతున్నారా?
నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది.అందుకే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ, అవయవాలు చురుకుగా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో కెఫీన్, టీలోని పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లాలు (Acid) పెరిగి ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి. రాత్రంతా శరీరానికి నీరు అందదు. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే ఉదయాన్నే నీటిని తీసుకోవడానికి బదులు టీ లేదా కాఫీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
అలారం ఆపి మళ్లీ పడుకోవడం
స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు అలారం ఆపి మళ్లీ పడుకుంటారు. ఫలితంగా లేట్‌గా లేస్తారు. హరిబరీ పనులు చేయడం వలన ఏదో ఒకటి మర్చిపోతుంటారు. లంచ్ బాక్స్, ఐడీ కార్డ్స్, ముఖ్యమైన వస్తువులు ఫలితంగా ఆరోజు చివాట్లు తినాల్సి రావొచ్చు.ఒక్కసారి లేచాక మళ్లీ నిద్రపోవడం వల్ల లభించే నిద్ర నాణ్యతగా ఉండదు.దీనివల్ల ఉదయం మరింత బద్ధకంగా, అలసటగా అనిపిస్తుంది. స్నూజ్ చేసిన తర్వాత వచ్చే కొద్దిపాటి నిద్ర గాఢంగా ఉండదు. దీనివల్ల లేచిన తర్వాత కూడా మత్తు, నీరసం ఎక్కువసేపు ఉంటాయి. శరీరం సహజంగా మేల్కొనే సమయాన్ని గందరగోళానికి గురిచేసి, రాత్రి నిద్రపైనా ప్రభావం చూపుతుంది.
అల్పాహారం మానేస్తే అంతే సంగతులు..
రాత్రి సుదీర్ఘ విరామం తర్వాత శరీరానికి పోషకాలు అవసరం.అల్పాహారం మానేయడం వల్ల నీరసం, చిరాకు కలుగుతాయి. ఉదయం నూనె పదార్థాలు అతిగా తిన్నా రోజంతా మత్తుగా అనిపిస్తుంది. పోషకాహారంతో కూడిన సమతుల్య అల్పాహారం తీసుకోవడం ఉత్తమం.అల్పాహారం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి అలసట, తలనొప్పి, చిరాకు కలుగుతాయి.క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణక్రియ, మెటబాలిజం వేగం తగ్గి బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
సూర్యరశ్మి,గాలికి దూరంగా ఉంటున్నారా?
రోజంతా గదిలోనే ఉండిపోవడం వల్ల శరీర సహజ గడియారం (Circadian Rhythm) దెబ్బతింటుంది.కొద్దిసేపు బయట నడవడం లేదా కిటికీలు తెరిచి తాజా గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.ఉదయం సహజ వెలుతురు తగలకపోతే శరీర అంతర్గత గడియారం (Sleep-Wake Cycle) అస్తవ్యస్తమై, పగలు నిద్రమత్తు, రాత్రి నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.తాజా గాలి, వెలుతురు లేకపోవడం వల్ల మానసిక ఉల్లాసం తగ్గి, కొంతమందిలో నిరాశ (Low Mood) లేదా నీరసం పెరిగే అవకాశం ఉంటుంది.
