Currency Burn : భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు భర్త నిప్పు (వైరల్)
భార్య షాపింగ్ విషయంలో భర్త నారాజ్ అయ్యాడు. ఇదేంటని అడిగితే భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో ఆగ్రహించి భర్త పిచ్చిగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న డబ్బులు అన్నింటికీ నిప్పుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో తన భర్త మంజీత్ ధాకడ్ కోసం రూ.22 వేలు వెచ్చించి భార్య ఒక సూట్ కొనుగోలు చేసింది. సూట్ కోసం రూ.22 వేలు వెచ్చించాల్సిన అవసరం ఏంటని భార్యను భర్త నిలదీశాడు.‘ఇల్లు కొనేందుకు నేను డబ్బులు జమ చేస్తుంటే.. నువ్వు వృథా చేస్తావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.దాంతో అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. డబ్బుల వల్లే తమ మధ్య గొడవ జరిగిందిని భావించిన మంజీత్ ధాకడ్.. వాటిని తగలబెట్టేస్తానని భార్యకు చెప్పాడు. అన్నట్టుగానే బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసి రూ.500 నోట్లకు నిప్పు పెట్టాడు.
