వైరల్ న్యూస్

Currency Burn : భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు భర్త నిప్పు (వైరల్)

భార్యాభర్తల మధ్య గొడవలు కామన్. కానీ, చిన్న విషయాలకే భార్యలు తీసుకునే నిర్ణయాలు భర్తలను ఒక్కక్షణం ఆలోచించకుండా చేస్తాయి. ఫలితంగా వారు ఆ క్షణంలో ఎటువంటి భయానక నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. గొడవల కారణంగా దాంపత్య జీవితం దెబ్బతింటుంది.

భార్యాభర్తల మధ్య గొడవలు కామన్. కానీ, చిన్న విషయాలకే భార్యలు తీసుకునే నిర్ణయాలు భర్తలను ఒక్కక్షణం ఆలోచించకుండా చేస్తాయి. ఫలితంగా వారు ఆ క్షణంలో ఎటువంటి భయానక నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. గొడవల కారణంగా దాంపత్య జీవితం దెబ్బతింటుంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఫలితంగా విడాకులకు దారితీయొచ్చు. లేదా అఘాయిత్యాలకు ప్రేరేపించవచ్చు. అందుకే గొడవలు రాకుండా ఉండేందుకు దంపతులు కూర్చుని మాట్లాడుకోవాలని పెద్దలు సలహా ఇస్తున్నారు.

అర్థం చేసుకోకపోతే అంతే..

ఇటీవలి కాలంలో భార్యభర్తల మధ్య గొడవలకు అర్థం చేసుకునే గుణం లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.ఫలితంగా చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. చివరకు ఫైటింగ్ వరకు వెళ్తున్నాయి. లేదా ఒకరి మీద మరొకరికి ప్రేమ తగ్గిపోయేలా చేసి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేవరకు వెళ్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. భార్య షాపింగ్ విషయంలో భర్త నారాజ్ అయ్యాడు. ఇదేంటని అడిగితే భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో ఆగ్రహించి భర్త పిచ్చిగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న డబ్బులు అన్నింటికీ నిప్పుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే.. రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లో తన భర్త మంజీత్ ధాకడ్ కోసం రూ.22 వేలు వెచ్చించి భార్య ఒక సూట్ కొనుగోలు చేసింది. సూట్ కోసం రూ.22 వేలు వెచ్చించాల్సిన అవసరం ఏంటని భార్యను భర్త నిలదీశాడు.‘ఇల్లు కొనేందుకు నేను డబ్బులు జమ చేస్తుంటే.. నువ్వు వృథా చేస్తావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

దాంతో అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. డబ్బుల వల్లే తమ మధ్య గొడవ జరిగిందిని భావించిన మంజీత్ ధాకడ్.. వాటిని తగలబెట్టేస్తానని భార్యకు చెప్పాడు. అన్నట్టుగానే బ్యాంక్‌లో ఉన్న డబ్బులు తీసి రూ.500 నోట్లకు నిప్పు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. డబ్బులకు నిప్పు పెట్టే బదులు ఆ సూట్ రిటర్న్ ఇవ్వొచ్చు కదా? భార్యకు ప్రేమగా చెప్పుకోవచ్చు కదా? అని కామెంట్స్ చేస్తున్నారు.

తర్వాత చదవండి