స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
AssemblySeats AP, Telangana: ఏపీకి 88.. తెలంగాణకు 60!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏపీలో మరో 88 స్థానాలు, తెలంగాణలో మరో 60 స్థానాలు రావచ్చన్న అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు డీలిమిటేషన్ చర్చలో లోక్సభ స్థానాల పెంపే ప్రధాన అంశంగా కనిపించింది. కానీ కొత్త బిల్లులో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా 50 శాతం పెంచాలని ప్రతిపాదించడం అసలు మార్పు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా పడనుంది.
