తెలంగాణ

BRS : రూ.5 వేల కోట్ల భూముల వేలం.. హెచ్ఎండీఏ ఆఫీసు ముట్టడించిన బీఆర్ఎస్

రాష్ట్రంలో భూముల వేలానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిన విషయం తెలిసిందే. ఈనెల 27న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను వేలం వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.హైదరాబాద్‌లో పరిధిలో ఖాళీ జాగా కనిపిస్తే అమ్మేస్తున్నారని, అలా చేయడం సరికాదని వాదిస్తోంది. ఉన్న భూములు అన్ని అమ్ముకుంటూ పోతే రేపటి రోజున గ్రేటర్ పరిధిలో భూమి మిగలదని హెచ్చరించింది.అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో రూ.5 వేల కోట్ల భూముల విక్రయానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు ఐక్యంగా ఆందోళనలు చేపట్టారు.