తెలంగాణ

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కోటి రూపాయల విరాళం

Aurobindo Pharma: మంచిరేవులలోని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ మౌలిక వసతుల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌కు చెక్కును అందజేసింది. అరబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ ఎస్‌. సదానంద రెడ్డి, అరబిందో ఫార్మా లిమిటెడ్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఐ.ఎస్‌.ఆర్‌. రావు ఈ చెక్కును డీజీపీకి అందించారు.