Spirituality
శబరిమలను తలపించిన శంభీపూర్! వేల మంది స్వాములతో మహాపడి పూజ
తెలంగాణ ఏర్పడేంత వరకు శంభీపూర్ లో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనని భీష్మించి కూర్చున్న 23ఏళ్ల సుంకరీ రాజు భక్తితో ఉద్యమాన్ని చాటి చెప్పారు. 20ఏళ్ల తర్వాత ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని ఎమ్మెల్సీగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలో కరువు ఛాయలు లేకుండా చూడాలని అయ్యప్ప మాల ధరించారు. కన్నెస్వామిగా శబరిమలైలో ఎలా అయితే మండపాలు ఉంటాయో అలానే తాత్కాలిక మండపాలతో మహా పడి పూజ నిర్వహించారు. సుమారు 4వేల మంది అయ్యప్ప స్వాములు, 2వేల మంది భక్తులతో పూజ ఘనంగా నిర్వహించారు.
